విశాఖలో రెండో వన్డే.. టికెట్ల కోసం బారులు!

  • 19న టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్
  • ఆఫ్ లైన్ లో ఈ రోజు నుంచి ప్రారంభమైన టికెట్ విక్రయాలు
  • వేకువజాము నుంచే క్యూకట్టిన క్రికెట్ అభిమానులు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నిన్న ముగిసింది. చివరి టెస్టును డ్రాగా చేసుకుని.. 2-1 తేడాతో సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక రెండు జట్ల మధ్య 17వ తేదీ నుంచి వన్డే సమరం మొదలు కానుంది.

తొలి వన్డే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక రెండో వన్డే మాత్రం 19న విశాఖలో జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను ఈనెల 10 నుంచే ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. ఈరోజు నుంచి ఆఫ్ లైన్ లో అమ్ముతున్నారు. 

విశాఖలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. కౌంటర్ల వద్ద ఈ రోజు వేకువజాము నుంచే జనం బారులుతీరారు. వందల మంది క్యూ కట్టారు. కొందరు మహిళలు చిన్న పిల్లల్ని చంకనేసుకుని లైన్ లో నిలబడటం గమనార్హం. తోపులాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

Visakhapatnam Cricket Stadium
ticket counters
heavy rush
Team India
Australia
second one day

More Telugu News